యాష్గబట్: చనిపోయిన రాజకీయ నేతలు, సినీ, క్రీడా ప్రముఖుల సేవలను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం మామూలే. కానీ తుర్క్‌మెనిస్థాన్ అనే దేశంలో ఓ కుక్క బ్రీడ్‌ను గుర్తు చేసుకుంటూ బంగారు విగ్రహం తయారు చేయడం కాస్త వెరైటీ అనే చెప్పాలి. మరో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. సదరు కుక్క విగ్రహాన్ని ఆ దేశాధినేత ఏర్పాటు చేయించడం . వివరాలు.. తుర్క్‌మెనిస్థాన్ ప్రెసిడెంట్ గుర్బంగులి బెర్డిముఖమెదోవ్స్‌కు కుక్కలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా సెంట్రల్ ఏషియాలో దొరికే అలబాయ్ అనే అరుదైన డాగ్ బ్రీడ్ అంటే ఆయనకు మహా మక్కువట. తాజాగా అలబాయ్ బ్రీడ్ డాగ్స్‌ను గుర్తు చేసుకుంటూ దేశ రాజధాని యాష్గబట్‌లోని ట్రాఫిక్ సర్కిల్‌లో బంగారు విగ్రహాన్ని గుర్బంగులి ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో గుబ్బంగులి పాల్గొన్నారు. కుక్క విగ్రహం కింద ఓ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. అందులో అలబాయ్ బ్రీడ్ డాగ్స్ ఆరుబయట ఆడుకునే వీడియోలను ప్లే చేశారు.
Turkmenistan. Przywódca tego państwa Gurbanguły Berdymuchamedow uroczyście otworzył pomnik dla swego ulubionego psa. pic.twitter.com/35IDhZLfZc
— Andrzej Poczobut (@poczobut) November 12, 2020