వరంగల్లో గ్రాండ్ గా ఎల్‌బీ కాలేజీ గోల్డెన్‌ జూబ్లీ

వరంగల్ సిటీ, వెలుగు :  వరంగల్​జిల్లా కేంద్రంలోని ఎల్ బీ కాలేజీలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. కాలేజీ చైర్మన్ కె.నిరంజన్ అధ్యక్షతన గురువారం జయసేన ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కేయూ వీసీ ప్రొ.తాటికొండ రమేశ్​చీఫ్​గెస్ట్ గా హాజరయ్యారు. ముందుగా ఆయన చేతుల మీదుగా ఎల్​బీ కాలేజీ 50 వసంతాల ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు.

అనంతరం వీసీ రమేశ్​ మాట్లాడుతూ.. ఎల్​బీ కాలేజీ ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిందని, ఇక్కడి లెక్చరర్లు, యాజమాన్యం విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. కాలేజీ 50 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో స్టూడెంట్లు అలరించారు. పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.