
- మగ్గంపై నేసిన నేత కార్మికుడు హరిప్రసాద్
- చీరపై సీతారామలక్ష్మణులు, హన్మంతుడి రూపాలు
రాజన్నసిరిసిల్ల, వెలుగు : శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి సీతమ్మకు సమర్పించేందుకు సిరిసిల్లలో బంగారు చీర రెడీ అయింది. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్దండి హరిప్రసాద్ 15 రోజుల పాటు శ్రమించి చేనేత మగ్గంపై బంగారు చీర నేశాడు. ఒక గ్రాము బంగారం, జరీ పట్టు దారంతో 800 గ్రాముల బరువున్న ఏడు గజాల చీర రూపొందించాడు. చీరపై శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే శ్లోకం 51 సార్లు వచ్చేలా తయారు చేయడమే కాకుండా చీర కొంగుపై సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడి రూపాలు, శంకుచక్రాలు వచ్చేలా చీర నేశాడు. హరిప్రసాద్ 2023 నుంచి తన సొంత ఖర్చులతో సీతమ్మ చీరను రూపొందిస్తున్నారు.