కన్నడ స్టార్ గణేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పినాక’. కొరియోగ్రాఫర్ బి ధనంజయ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపును అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడలో నిర్మిస్తున్న చిత్రమిది.
ఈ బ్యానర్‌లో 49వ చిత్రంగా తెరకెక్కుతోంది. గురువారం ఈ మూవీ టైటిల్, టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో క్షుద్ర, రుద్రగా గణేష్ స్టన్నింగ్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం గణేష్ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెప్పారు.