ఉద్యోగాలు పోయాయ్.. 1800 మందిని తొలిగించిన గోల్డ్‌మ్యాన్ సాక్స్

ఉద్యోగాలు పోయాయ్.. 1800 మందిని తొలిగించిన గోల్డ్‌మ్యాన్ సాక్స్

ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితి సవాలుగా మారడంతో కాస్ట్ కటింగ్ లో భాగంగా పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగుల ఏరివేత కొనసాగిస్తూనే ఉన్నాయి. 

ప్రతిష్టాత్మక గోల్డ్‌మన్ సాక్స్ తమ వార్షిక సమీక్షలో భాగంగా దాదాపు 1300 నుండి 1,800 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' కథనాన్ని ప్రచురించింది. ఈ తొలగింపులు సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 3 నుంచి 4 శాతం మేర ఉండనున్నట్లు తెలిపింది. తొలగింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు వెల్లడించింది.

ఈ విషయంపై గోల్డ్‌మ్యాన్  సాక్స్ ప్రతినిధి టోనీ ఫ్రాట్టో మాట్లాడుతూ.. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను గుర్తించడం, తొలగించడం సంస్థలలో సాధారణమని తెలిపారు. ఈ ఏడాది తొలగింపులు.. 2023తో పోలిస్తే ఎక్కువగా ఉండొచ్చని ఫ్రాట్టో పేర్కొన్నారు.

ALSO READ | పెరుగుతున్న వైట్ కాలర్ జాబ్స్​