Gold Rates Today: పెరిగిన బంగారం ధరలు.. అసలే పెళ్లిళ్ల సీజన్.. ఇలా అయితే కొనేదెలా..?

కేంద్ర బడ్జెట్ సమయంలో భారీగా తగ్గిన బంగారం ధర మళ్లీ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. సోమవారం నాడు (12.08.2024) బంగారం ధర మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 250 రూపాయలు పెరిగింది. ఆదివారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, సోమవారం ఈ ధర రూ.64,700కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం నాడు 70,310 రూపాయలు ఉండగా, సోమవారం నాటికి 70,580 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై సోమవారం 270 రూపాయలు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి.

బంగారం ధరలు (12--.08.2024) ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి:

  • హైదరాబాద్: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)
  • విజయవాడ: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)
  • బెంగళూరు: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)
  • చెన్నై: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)
  • అహ్మదాబాద్: రూ. 64,750 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,630 (24 క్యారెట్/10 గ్రాములు)
  • జైపూర్: రూ.64,850 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,730 (24 క్యారెట్/10 గ్రాములు)
  • కోయంబత్తూర్: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)
  • కేరళ: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)
  • లక్నో: రూ.64,850 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,730 (24 క్యారెట్/10 గ్రాములు)
  • ముంబై: రూ.64,700 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,580 (24 క్యారెట్/10 గ్రాములు)
  • ఢిల్లీ: రూ.64,850 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,730  (24 క్యారెట్/10 గ్రాములు)
  • కోల్కత్తా: రూ.64,700 (22 క్యారెట్/10 గ్రాములు), రూ.70,580 (24 క్యారెట్/10 గ్రాములు)
  • మధురై: రూ. 64,700 (22 క్యారెట్/10 గ్రాములు),  రూ.70580 (24 క్యారెట్/10 గ్రాములు)

ఇక వెండి ధరల విషయానిస్తే.. పసిడి ధరలు సోమవారం నాడు స్వల్పంగా పెరగ్గా.. వెండి ధరలు మాత్రం భారీగా పతనమయ్యాయి. కిలో వెండి ధరపై రూ.600 తగ్గింది. ఆదివారం రోజు కిలో వెండి ధర రూ.83,100 ఉండగా సోమవారం రూ.82,500కి చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మాత్రం వెండికి డిమాండ్ బాగానే ఉంది. కిలో వెండి ధర రూ.87,500గా ఉంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో కిలో వెండి ధర రూ.82,500 కాగా.. బెంగళూరులో కిలో వెండి ధర రూ.79,000 వద్దే నిలిచిపోయింది.