ఇంటికి లాక్ వేసుకుని ఆఫీస్‌కు వెళ్లిపోయాక.. చెప్పకుండా చుట్టాలు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ.. డోర్‌కి ఈ స్మార్ట్ లాక్ ఉంటే ఆఫీస్ నుంచే అన్‌లాక్ చేయొచ్చు. దీన్ని గోలెన్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ లాక్‌ని ఫేస్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్, మొబైల్ యాప్, పాస్వర్డ్, ఆర్ఎఫ్ఐడీ కార్డ్, వర్చువల్ పాస్వర్డ్, ఓటీపీ, మెకానికల్ కీ.. ఇలా ఎనిమిది రకాలుగా అన్‌లాక్ చేయొచ్చు.
ఇందులో హైక్వాలిటీ కెమెరా ఉంటుంది. అది అన్‌లాక్ చేసేటప్పుడు ముఖాలను ఈజీగా గుర్తిస్తుంది. ఇందులో వైఫై ఫీచర్ కూడా ఉంది. దీంతో మనం ఎక్కడున్నా యాప్ ద్వారా లాక్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఇక ఇందులోని స్మార్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ 100 వేలిముద్రలను గుర్తించగలదు. మరో ప్రత్యేకత ఏంటంటే.. డోర్ బెల్ కూడా ఉంటుంది. ఎవరైనా బెల్ కొడితే వెంటనే కెమెరా ఆన్ అవుతుంది. డోర్ లోపలి వైపు ఉన్న డిస్ప్లేలో బెల్ కొట్టినవాళ్ల వీడియో కనిపిస్తుంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. ధర : 12,790 రూపాయలు