మీరు విన్నది కరెక్టే..! : పానీపూరీ కాదు.. బీరు పూరీ.. ఇదో టేస్ట్..

భారతీయులు ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు.. ఇక వెరైటీ ఫుడ్​ అంటే చాలు.. ఎంత దూరమైనా వెళతారు. ఇక వీకెండ్​ వస్తే చాలు .. సిటీస్​.. పెద్ద పెద్ద పట్టణాల్లో హోటల్స్​.. రెస్టారెంట్లు బిజీ అవుతాయి.  కొన్ని హోటల్స్​ అయితే  ఈవారం స్పెషల్​ ఐటం అని రాస్తూ.. ఆ రోజు తయారు చేసిన వెరైటీ ఫుడ్​ బోర్డ్​ పెడతారు. ఇప్పుడు యూత్​ పబ్​ కల్చర్​ కు కూడా అలవాటు పడిందనుకోండి..   అయితే అక్కడ మద్యం సేవిస్తే టచ్చింగ్​ ఉండే ఐటమ్స్​ వెరైటీ ఉండాలనుకుంటున్నారు. కొన్ని కొన్ని చూడటానికి.. వింటానికి బాగున్నా.. మరికొన్ని వింటేనే చాలు వాంతులు చేసుకుంటున్నారు.

కొంతమంది మద్యం సేవిస్తూ స్నాక్స్​ లేక పోవడంతో కొత్త రకమైన వంటకాన్ని కనుగొన్నారు.  సాధారణంగా పానీ పూరి( గోల్గప్ప)లో మసాలా నీరు (పానీ). ఆనియన్​ నింపి లొట్టలేసుకుంటూ తింటారు,  కాని ఇక్కడ పానీపూరిలో ... పానీ ని వాడలేదు.  దాని స్థానంలో బీరు వాడారు.  అంతే కాదు ఆ బీరు బాటిల్పై ఇది స్వచ్చమైన దేశీయ మద్యం అని  రాసి ఉంది.  పానీ పూరిని తినేటప్పుడు.. పూరీకి చిన్న రంధ్రం చేసి అందులో మసాలా పానీ.. ఆనియ, చిక్​ పీస్​, బాగా ఉడికిన మెత్తని బంగాళదుంపలు​ మిక్స్​ చేసి తింటారు.  కాని ఇక్కడ చిన్న రంధ్రం చేసి  ఇవన్నీ పోయాల్సిన చోట మద్యం పోశారు.  ఈ సీన్​  కాస్త ఉల్లాసం కలిగేంచేందుకు బ్యాక్​ గ్రౌండ్స్​ లో హే ప్రభూ అంటూ మీమ్స్​ కనిపించేలా సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.  దీనిపై స్పందించిన నెటిజన్లు  కొంతమంది ఎంజాయిమెంట్​ కు దూరంగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ కామెంట్​ చేశారు.  మరికొంతమంది గోల్గప్ప( పూరీ), మద్యం రెంటిని వేస్ట్​ చేస్తున్నారని రాసుకొచ్చారు.  ఇంకొకరు జస్ట్​ ఫన్నీగా ఎవరో కొంతమంది అబ్బాయిలు నీటిని పొదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.