గోలీ సోడా.. అదో స్పెషల్.. మార్కెట్​లో డిఫరెంట్ ఫ్లేవర్లు

గోలీ సోడా.. అదో స్పెషల్.. మార్కెట్​లో డిఫరెంట్ ఫ్లేవర్లు
  • సిటీలో పెరుగుతున్న డిమాండ్  మార్కెట్​లో డిఫరెంట్ ఫ్లేవర్లు

హైదరాబాద్, వెలుగు: ఎండలు భారీగా ఉండటంతో జనం కొబ్బరి నీళ్లు, లస్సీ, ఫ్రూట్ జ్యూస్ లాంటి లిక్విడ్ ఐటమ్స్​ను ఎక్కువగా తీసుకుంటున్నారు. కాగా వీటితో గోలీ సోడా పోటీ పడుతోంది. ఈ ఏడాది సిటీలో గోలీ సోడా సెంటర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లోనే కనిపించే సోడాలు.. ఆ తర్వాత కనుమరుగయ్యాయి. కానీ రెండు మూడేండ్లుగా సిటీలో ఈ సెంటర్లు భారీగా పుట్టుకొచ్చాయి. గోలీ సోడా ఓ ట్రెండ్​గా మారింది. అనేక రెస్టారెంట్లలోనూ గోలీ సోడా అందిస్తున్నారు. ఒకప్పుడు సాల్ట్, స్వీట్, ఆరెంజ్ ఫ్లేవర్లు మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు వివిధ కలర్లతోపాటు గ్రేప్స్, జీరా, మ్యాంగో, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ఫైనాఫిల్, సుగంధి వంటి ఫ్లేవర్లతో పదుల సంఖ్యలో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఫ్లేవర్​ను బట్టి ఒక్క సోడాను రూ.20 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు.

రోజుకు 350 సోడాలు అమ్ముతం

సమ్మర్​లో ఎక్కువగా లెమన్ సోడాను తాగుతున్నరు. మధ్యాహ్నమే మంచి గిరాకీ ఉంటోంది. రోజుకు 350 సోడాల దాకా అమ్ముతం. సిటీలో చాలా చోట్ల మా బ్రాంచ్​లు ఉన్నాయి.
–సోను, ‘1920 గోలీ సోడా సెంటర్’, ప్రకాశ్​నగర్ మెట్రో స్టేషన్

చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తయ్

మార్కెట్​లో చాలా రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కానీ గోలీ సోడా అంటేనే అదో స్పెషల్. చూడగానే చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి. అప్పట్లో రూ. 2 మాత్రమే ఉండేది. ఇప్పుడు రూ. 20  నుంచి రూ.50 వరకు అయ్యింది.
–సాయి, ప్రైవేట్ ఎంప్లాయ్,  బంజారాహిల్స్