అక్రమంగా ఇల్లు కూల్చారని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా

అక్రమంగా ఇల్లు కూల్చారని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా

నస్పూర్, వెలుగు: అన్ని అనుమతులతో నిర్మించుకున్న షెడ్ ను మున్సిపల్ ఆఫీసర్లు అక్రమంగా కూల్చారని కుటుంబసభ్యులతో కలిసి గొల్ల దశరయ్య అనే వ్యక్తి నస్పూర్ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీగల్ పహడ్ శివారు సర్వే నంబర్ 45లోని పట్టా భూమిలో నిర్మించుకున్న షెడ్ ను మున్సిపల్ ఆఫీసర్లు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారని తెలిపారు. ఇంటికి నంబర్ ఉందని, కరెంట్ బిల్లు కూడా ఉందన్నారు. అన్నీ సక్రమంగా చెల్లించుతున్నప్పటికీ ఇంటిని కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు కదలమని చెప్పడంతో పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. 

ALSO Read : తుంగతుర్తి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ‘దామన్న’ చిచ్చు
 

అనుమతుల్లేవు: మున్సిపల్ కమిషనర్ 

ఊరు శ్రీరాంపూర్ లోని ఠాగూర్ నగర్ లో దశరయ్య నిర్మించిన షెడ్ కు ఎలాంటి అనుమతులు లేవని, పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో కూల్చామని మున్సిపల్​కమిషనర్​సతీశ్ వెల్లడించారు. గురువారం మున్సిపల్ ఆఫీస్​కు వచ్చి ఇబ్బందులు పెట్టడంతో వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని చెప్పారు.