పొంగిన నాలా.. పార్సిగుట్ట బురదమయం

పొంగిన నాలా.. పార్సిగుట్ట  బురదమయం

శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ఏరియాలోని గొల్ల పుల్లయ్య బావి నాలా పొంగింది. న్యూఅశోక్ నగర్, పార్సిగుట్టలోని కాలనీలను వరదతోపాటు మురుగు ముంచెత్తింది. శనివారం ఇండ్ల ముందు బురద పేరుకుపోయింది. ఇలాగే ఉంటే తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బురదను తొలగించాలని కోరుతున్నారు. భవిష్యత్​లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.– హైదరాబాద్​సిటీ, వెలుగు