
నిర్మల్, వెలుగు: ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తోపాటు నిర్మల్ మాజీ ఎంపీపీ అయిండ్ల పోశెట్టి, మంజులాపూర్ సమాజీ సర్పంచ్ నరేశ్ తదితరులు ఆదివారం మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కార్యక్రమంలో సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, పూదరి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
కుంటాల, వెలుగు: కుంటాల మండలంలో బీఆర్ ఎస్ ఖాళీ అయ్యింది. ఆదివారం బైంసాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క సమక్షంలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్పీటీసీ కొత్త పల్లి గంగమని బుచ్చన్న, సొసైటీ చైర్మన్సట్ల గజ్జరాం, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేశ్, ఆత్మ మాజీ చైర్మన్ అశోక్ రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, నాయకులు కాంగ్రెస్ లో చేరారు.