లా కాలేజీని ఏర్పాటు చేయాలని ధర్నా 

  •     గోండ్వాన సంక్షేమ పరిషత్‌‌ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట నిరసన 

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో లా కాలేజీని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం ఐటీడీఏ ఎదుట గోండ్వాన సంక్షేమ పరిషత్​ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.  పీవో ప్రతీక్​జైన్​కు వినతిపత్రం ఇచ్చి భద్రాచలంలో లా కాలేజీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్స్ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ కోరారు.

ఐదవ షెడ్యూల్​ ప్రాంతమైన ఏజెన్సీకి మధ్యలో ఉన్న భద్రాచలంలో లా కాలేజీ ఏర్పాటు చేస్తే ఆదివాసీలు న్యాయశాస్త్రం చదువుకునే వీలు కలుగుతుందన్నారు.  జూన్​ మొదటి వారంలో హైదరాబాద్‌‌ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తామని వెల్లడించారు.  కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర రాంబాబు, పూనెం సాయి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.