భారత మహిళా క్రికెటర్, తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష(Gongadi Trisha) చరిత్ర సృష్టించింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కింది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ వేదికగా మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిష ఈ ఘనత సాధించింది.
53 బంతుల్లో వంద మార్క్ చేరుకున్న త్రిష.. మొత్తంగా 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 110 పరుగులు చేసింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ సెంచరీ చేయలేదు. భారత క్రికెటర్‌దే తొలి శతకం. త్రిషకు తోడు కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు), సనికా ఛల్కే(20 బంతుల్లో 29; 5 ఫోర్లు) పరుగులు చేయడంతో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది.
🚨 HISTORY IN U19 WOMEN'S WORLD CUP 🚨
— CricketGully (@thecricketgully) January 28, 2025
Gongadi Trisha smashed the Maiden Hundred in the history of U19 Women's T20 World Cup. [Hotstar] pic.twitter.com/bVZILlnKjL
147 పరుగుల పార్టనర్‌షిప్
ఈ మ్యాచ్‌లో త్రిష- కమలిని జోడి మరో రికార్డు సృష్టించారు. తొలి వికెట్‌కు 147 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి వికెట్‌కు ఇదే అత్యధికం.
ALSO READ | MS Dhoni: 39 ఏళ్లొచ్చినా తగ్గేదెలా అంటున్న DK.. ధోనీని వెనెక్కి నెట్టేశాడు
త్రిష స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం. తండ్రి పేరు.. రామిరెడ్డి. కూతుర్ని క్రికెటర్‌గా తీర్చిదిద్దడం కోసం ఈయన ఎంతో కష్టపడ్డారు. కూతురి క్రికెట్ శిక్షణ కోసం చేస్తున్న ఉద్యోగం వదిలేసి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. తండ్రి తన కోసం చేసిన త్యాగాలను మరిపిస్తూ.. టీ20 ప్రపంచ కప్‌లో త్రిష సత్తా చాటుతోంది.