అండర్ -19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన గొంగడి త్రిషను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష ఫిబ్రవరి 5న కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ ను కలిశారు .
ఈ సందర్భంగాఅండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన త్రిషను సన్మానించారు రేవంత్. అంతేగాకుండా గొంగడి త్రిషకు ప్రోత్సాహకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించారు రేవంత్. భవిష్యత్తులో టీమిండియాలో మరింతగా రాణించాలని కోరారు.
త్రిషకు కోటి రూపాయలతో పాటు టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్ కు , ట్రైనర్ షాలినికి 10 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు.
Also Read : తప్పుడు రిపోర్ట్లతో రెచ్చగొడుతున్నరు
అండర్ 19 టీ20 టోర్నమెంట్ లో మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో 309 రన్స్ చేసి.. ఏడు వికెట్లు పడగొట్టిన త్రిష పెర్ఫామెన్స్ ఈ టోర్నీకే ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసిందే..