గొంగడి త్రిష ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షో.. బీసీసీఐ విమెన్స్‌‌‌‌ వన్డే ట్రోఫీలో సెంచరీ

గొంగడి త్రిష ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షో..  బీసీసీఐ విమెన్స్‌‌‌‌ వన్డే ట్రోఫీలో సెంచరీ

హైదరాబాద్‌‌‌‌: తెలంగాణ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ గొంగడి త్రిష (124 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 101 నాటౌట్‌‌‌‌, 2/38) ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టడంతో.. బీసీసీఐ విమెన్స్‌‌‌‌ అండర్‌‌‌‌–23 వన్డే ట్రోఫీలో హైదరాబాద్‌‌‌‌ బోణీ చేసింది. 

బుధవారం జరిగిన తొలి రౌండ్‌‌‌‌  మ్యాచ్‌‌‌‌లో 7 వికెట్ల తేడాతో ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ 50 ఓవర్లలో 187/8 స్కోరు చేసింది. ఈషా భారతీ (89), యతి శర్మ (46) మెరుగ్గా ఆడారు. జాజ్మిన్‌‌‌‌ గిల్‌‌‌‌, త్రిష, త్రిష పూజిత తలా రెండు వికెట్లు తీశారు. 

తర్వాత ఛేజింగ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 42.5 ఓవర్లలో 188/3 స్కోరు చేసి నెగ్గింది. త్రిషతో పాటు త్రిష పూజిత (39), మమతా (32 నాటౌట్‌‌‌‌) చెలరేగారు. శివాని యాదవ్‌‌‌‌ రెండు వికెట్లు తీసింది.