యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ స్కామ్‌లకు మారుపేరని, పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అవినీతిమయంగా మారుస్తారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి విమర్శించారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన 150 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని, మోసపూరిత హామీలతో మళ్లీ అధికారంలోకి రావాలని కుట్ర చేస్తోందన్నారు.
ఆరు గ్యారంటీ స్కీముల పేరుతో ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకుపోతారని హెచ్చరించారు. సర్పంచ్ కుమ్ము సరితా శేఖర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నాగపురి కిషన్, మాజీ సర్పంచ్ స్వర్గం నరహరి, నాయకులు బెదరబోయిన రవి, జంగిటి అడివయ్య ఉన్నారు.