కార్మికులు ఆనందపడేలా మూడో అగ్రిమెంట్ : గొంగిడి మహేందర్ రెడ్డి

కార్మికులు ఆనందపడేలా మూడో అగ్రిమెంట్ : గొంగిడి మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఆనందపడేలా మూడో అగ్రిమెంట్ ఉంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ కార్మిక విభాగం గౌరవ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ కేవీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండు అగ్రిమెంట్లను గొప్పగా చేశామని, ఈసారి కార్మికులు ఊహించని విధంగా మూడో అగ్రిమెంట్ ఉంటుందని తెలిపారు. కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించి కార్మికులకు వేజ్ అగ్రిమెంట్ తోపాటు బెనిఫిట్స్ కూడా అందేలా చూస్తామని పేర్కొన్నారు. 

కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ కేవీ పాటుపడుతుందని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణగౌడ్, బీఆర్ఎస్ కేవీ జనరల్ సెక్రటరీ నర్సింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ పాపయ్య, ఉపాధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య, కోశాధికారి రమేశ్, కార్మికులు పాల్గొన్నారు.