యాదగిరిగుట్ట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో రూ.65 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు లింకురోడ్లు ఉండేవి కావని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గ్రామాలకు రోడ్ల ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ మొగిలిపాక తిరుమల రమేశ్, ఉప సర్పంచ్ సీస లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు గుండ్లపల్లి వెంకటేశ్ గౌడ్ ఉన్నారు.