రైతు వ్యతిరేక కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి : గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, వెలుగు: రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి,  ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు.  తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ కరెంట్, ధరణి తీసేసి రైతుబంధు బంద్ చేసే కాంగ్రెస్ మనకు అవసరమా అని  ప్రశ్నించారు. వ్యవసాయం పండగ చేసిన కేసీఆర్ ను గెలిపించుకుందామని పిలుపునినచ్చారు.

తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధికి పాటుపడిన ఘనత సీఎం కేసీఆరే దక్కిందన్నారు.  బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఆలేరు సహా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేలా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. అలాగే యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా గొంగిడి సునీత తరఫున డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి సునీతను గెలిపించాలని అభ్యర్థించారు.  కార్యక్రమంలో సుదగాని హరిశంకర్ గౌడ్,  పార్టీ మండల అధ్యక్షుడు  వెంకటయ్య,  రవీందర్ గౌడ్,  జహంగీర్ గౌడ్, జడ్పీటీసీ అనురాధ, సర్పంచ్ బీరయ్య,  శ్రీనివాస్ గౌడ్,  అనిల్ గౌడ్,  రాజీవ్ గౌడ్ తదితరులు ఉన్నారు.