
గుడ్ బ్యాడ్ అగ్లీ సినీ నిర్మాతలకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన పాటలను రీ క్రియేట్ చేశారని, అందుకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని, ఏడు రోజుల్లోగా సినిమా నుండి పాటలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇళయరాజా హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు.“మేము గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో వాడిన పాటలకు అవసరమైన అన్ని అనుమతులను మ్యూజిక్ లేబుల్స్ నుంచి తీసుకున్నాం. ఆ హక్కులన్నీ లేబుల్స్కే ఉంటాయి. కాబట్టి మేము ప్రోటోకాల్ పాటించాం. వాటి నుంచి ఎన్ఓసీలు (NOCs) తీసుకున్నామని తెలిపారు. రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం..ఏ తప్పు చేయలేదని’’ మైత్రీ మేకర్స్ స్పష్టం చేశారు.
అయితే, ఈ సినిమాలో ఇళయరాజా స్వరపరిచిన ఓ మూడు పాత పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్ వాడుకున్నారు. నట్టుపురా పట్టు మూవీలోని ‘ఓతా రూబైయుమ్ తారే’, విక్రమ్ సినిమాలోని ‘ఇన్ జోడీ మంజల్ కురివి’, సకల కళా వల్లవన్ చిత్రం నుంచి ‘ఇలమై ఇదో ఇదో’ పాటలను ఈ మూవీలో కాసేపు ప్లే అవుతాయి. దాంతో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. గతంలో కూడా ఇళయరాజా తన పాటలను వాడుకున్న మేకర్స్ కు నోట్లిసులు ఇచ్చిన రికార్డు ఉంది.
అయితే, ఏదేమైనా తాను కంపోజ్ చేసిన పాటలను అడగాల్సిన అవసరం లేదా.. అనే పాయింట్ మీద ఇళయరాజా ఉన్నాడు. మరి తాజాగా మైత్రి నిర్మాతలు ఇచ్చిన సమాధానంతో ఇళయరాజా ఎలా స్పందిస్తాడో చూడాలి.