
అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. త్రిష హీరోయిన్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శనివారం ఈ మూవీ తెలుగు వెర్షన్ టీజర్‌ను విడుదల చేశారు. ‘ఏకే ఒక రెడ్ డ్రాగన్.. వాడి రూల్స్‌ను వాడే బ్రేక్ చేసి వచ్చాడంటే నిప్పుల శ్వాసతో మొత్తం తగలబెడతాడు’ అనే డైలాగ్‌తో అజిత్ పాత్రను పరిచయం చేశారు. యాక్షన్ సీన్స్‌తో కట్ చేసిన టీజర్‌లో అజిత్ నటన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
మనం ఎంత గుడ్‌గా ఉన్నా కూడా.. ఈ లోకం మనల్ని బ్యాడ్‌గా చేస్తుంది, జీవితంలో ఏమేమి చేయకూడదో కొన్నిసార్లు అవన్నీ చేయాలి..’ లాంటి తన మార్క్ డైలాగ్స్ ఇంప్రెస్ చేశాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చిన బీజీఎం టీజర్‌లోని సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. సునీల్ కీలకపాత్రలో కనిపించాడు. వాలి, బిల్లా లాంటి చిత్రాల్లోని గెటప్స్‌ను గుర్తుచేస్తూ వింటేజ్ అజిత్‌ను ఇందులో చూపించడం ఆకట్టుకుంది. అజిత్ నుంచి అభిమానులు ఆశించే అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతోందని టీజర్‌లో చూపించారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది.