బీఆర్ఎస్​కు మరో షాక్

  •     బీజేపీలో చేరనున్న ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్​పర్సన్!
  •     భర్తతో కలిసి పార్టీ మారనున్న శోభారాణి

 నిర్మల్/ లక్సెట్టిపేట, వెలుగు : నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్​కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పోటాపో టీగా కారు దిగుతున్నారు. తాజాగా మాజీ జడ్పీ చైర్​పర్సన్ శోభారాణి కూడా బీఆ ర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. భర్త సత్యనారాయణ గౌడ్ తో కలిసి శనివారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థి జి నగేశ్, జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి తదితరులతో కలిసి సుదీర్ఘ చర్చలు జరిపారు.

బీజేపీ నేతలంతా శోభారాణి ఇంటికి వెళ్లి వారిని సన్మానించి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. సీనియర్ నేతగా ఉన్న సత్యనారాయణకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని భరోసా ఇచ్చారు. దీంతో రెండు, మూడు రోజుల్లో సత్యనారాయణ గౌడ్ తో పాటు నిర్మల్ మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  

లక్సెట్టిపేట మండల నేతలు సైతం

లక్సెట్టిపేట మండలానికి చెందిన బీఆర్ ఎస్ మాజీ ఎంపీపీలు కొత్త వెంకటేశ్వర్లు, కట్ల చంద్రయ్యతోపాటు మాజీ వైస్ ఎంపీపీలు మోత్కూరు వెంకటస్వామి గౌడ్, పెండం రాజు, మాజీ సర్పంచ్ నడిమెట్ల రాజన్న, కౌన్సిలర్ సాయిని సుధాకర్ కాంగ్రెస్​లో చేరనున్నట్లు తెలుస్తోంది. .

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను కలసి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఈనెల 22న నిర్వహించనున్న కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వీరు చేరేందుకు రంగం  సిద్ధమైంది.