
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గా లకు న్యాయం జరుగుతుందని పీసీసీ చీఫ్, నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నా రు. శుక్రవారం ఆయన పీఏ పల్లి, చందంపేట మండల కేంద్రాలలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నా రు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలందరికి నెలకు రూ.6 వేలు అందిస్తామని, వరికి క్వింటా ల్ కు రూ.2500 మద్దతు ధర ఇస్తామని, ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. బీజేపీ, టీఆర్ ఎస్ మధ్య రహస్య ఒప్పం దం ఉందని, టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నా రు. మునుగోడు ఎంపీపీగా ఓడిపోయిన వ్యక్తికి కేసీఆర్ పార్లమెంట్ టికెట్టును ఇచ్చారన్నా రు. 16 మంది ఎంపీలు గెలిచినాటీఆర్ ఎస్ చక్రం తిప్పడమనేది వట్టి బూటకమని, రాహుల్ ను ప్రధానిని చేసేందుకు కాం గ్రెస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, జడ్పీచైర్మె న్ బాలూ నాయక్ మాట్లాడారు. ఆయా మండలాల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డిలకు ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.