కోహ్లీతో నా రిలేషన్‌‌‌‌ పర్సనల్: గంభీర్

కోహ్లీతో నా రిలేషన్‌‌‌‌ పర్సనల్: గంభీర్
  •     టీఆర్‌‌‌‌పీలు పెంచడం కోసం కాదన్న కోచ్​
  •     జడేజాను తప్పించలేదు: అగార్కర్
  •     లంక చేరుకున్న టీమిండియా

ముంబై :  బ్యాటింగ్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ విరాట్ కోహ్లీతో తన రిలేషన్‌‌‌‌ వ్యక్తిగతమైందని టీమిండియా కొత్త హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గౌతమ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ స్పష్టం చేశాడు. తమ ఇద్దరి మధ్య ఉండే బంధం టీఆర్‌‌‌‌పీలను పెంచడం కోసం కాదని స్పష్టం చేశాడు. ‘నాకు కోహ్లీ మధ్య ఉన్న సంబంధం టీఆర్‌‌‌‌పీల వరకు మంచిదే. కానీ బహిరంగంగా దీన్ని వ్యక్తపరచలేం. ఇద్దరు పరిణతి చెందిన వ్యక్తుల మధ్య ఉండే సంబంధమే మా మధ్య ఉంటుంది. ప్రస్తుతం నేను, కోహ్లీ 140 కోట్ల మంది ఇండియన్స్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఫీల్డ్‌‌‌‌లో విరాట్‌‌‌‌తో నాకు మంచి రిలేషన్‌‌‌‌ ఉంది. అతనితో ఎన్నిసార్లు మాట్లాడానో జనాలకు చెప్పాల్సిన పని లేదు. తను వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌. మంచి ప్రొఫెషనల్‌‌‌‌. అతనితో నా రిలేషన్‌‌‌‌ కచ్చితంగా బాగుంటుంది’ అని శ్రీలంక టూర్‌‌‌‌కు బయలుదేరే ముందు చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌ అజిత్‌‌‌‌ అగార్కర్‌‌‌‌తో కలిసి గంభీర్‌‌‌‌ మీడియాతో వ్యాఖ్యానించాడు. 2027 వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్‌‌‌‌ ఎక్కువ మ్యాచ్‌‌‌‌లు ఆడేందుకు అందుబాటులో ఉండాలన్నాడు. 

ఫ్యూచర్‌‌‌‌లో  మూడు ఫార్మాట్లకు భిన్నమైన జట్లు ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని గౌతీ పేర్కొన్నాడు.  కాగా, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌, డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌ ఫీడ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌, తరచుగా అందుబాటులో ఉండే అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే హార్దిక్‌‌‌‌ పాండ్యాను కాదని  సూర్య కుమార్‌‌‌‌ను టీ20 కెప్టెన్‌‌‌‌గా నియమించామని చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌ అజిత్‌‌‌‌ అగార్కర్‌‌‌‌ వెల్లడించాడు. జడేజాను వన్డే టీమ్‌‌‌‌ నుంచి తప్పించలేదన్నాడు. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌కు మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉందన్నాడు.  కాగా, ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్‌‌లో బయల్దేరిన ఇండియా టీమ్ శ్రీలంక చేరుకుంది.