
నర్సాపూర్, వెలుగు : రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు మంచి భవిష్యత్ఉంటుందని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కే.వీ రాజు అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని బీవీఆర్ఐటీ కాలేజ్లో ఉమెన్స్ ఎక్స్క్లూజివ్, మినీ ఎండ్యూరెన్స్ రేస్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కే.వీ. రాజు మాట్లాడుతూ ఈ విద్యుత్ వాహనశ్రేణిలో మహిళలతో కలిసి పెట్టుబడులు పెట్టాలని, పురోగతిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.