
చిరుధాన్యాలు ఆరోగ్యానిస్తాయి.. అంతేకాదు.. బరువు కూడా పెంచుతాయి. పోషకాలు కలిగిన చిరుధాన్యాల్లో శెనగలు ఒకటి. ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే శెనగలను చాలామంది ఇష్టపడి తింటుంటారు. ముఖ్యంగా ఉడకబెట్టుకుని లాగించేస్తుంటారు. అయితే ప్రతి రోజూ ఉడకబెట్టిన శెనగలను ఒక కప్పు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో శెనగలను భాగం చేసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. సన్నగా ఉండేవాళ్లు రోజూ తినడం వల్ల త్వరితగతిన బరువు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో కూడా కొవ్వు పెద్దగా పేరుకోదు.
ALSO READ | బిడ్డ తొలి అడుగేసిందంటే.. ఎలాంటి తీపి ఙ్ఞాపకాలో తెలుసా..
శెనగలను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీస్, ఫైబర్ అందుతాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. శెనగలు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు దరిచేరవు. రక్త హీనత సమస్యతో బాధపడేవాళ్లు ఉడకబెట్టిన శెనగలను తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి
–వెలుగు,లైఫ్–