Super Food : వానాకాలంలో దొరికే బోడ కాకర.. తిన్నోళ్లకు మంచి ఆరోగ్యం

Super Food : వానాకాలంలో దొరికే బోడ కాకర.. తిన్నోళ్లకు మంచి ఆరోగ్యం

రుచికి చేదైనా.. ఆరోగ్యానికిఎంతో మేలు చేసేది కాకర, అలాంటి కాకరనే మించింది. బోడకాకర, ఇది అడవిలో కాస్తుంది.కాబట్టి 'అడవికాకర' అని కూడా అంటారు.కాకరతో పోలిస్తే చాలా చిన్నగా టుంది. ఇక రుచిలోఅయితే దానికదే సాటి.తిన్నవాళ్లకి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.గిరిజనులకు ఉపాధి కూడా ఇస్తోంది. అటవీ ప్రాంతంలో ఎక్కువగా దొరికే ఈ బోడ కాకర కాయలకు పట్టణాల్లో కూడా భలే డిమాండ్ ఉంటుంది.

బోడ కాకరకాయలను 'కాకర', అని కూడా అంటారు. ఇవి పొట్టిగా, గుండ్రంగా ఉంటాయి. పైన చిన్నచిన్న ముళ్లలా ఉన్న తోలు ఉంటుంది. వీటిని చాలా వెరైటీల్లో వండుకోవచ్చు. ఇవి కాకర కాయల్లా చేదుండవు. అందుకే దీన్ని అందరూ ఇష్టపడుతుంటారు. ఊళ్లలో అయితే ప్రతి సంవత్సరం ఒక్కసారైనా తినాలిఅంటుంటారు.

ఏడాదిలో ఒక్కసారే

బోడకాకర కాయలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి. సాధారణంగా జూలై మొదటి వారంలో పూత వస్తుంది. మళ్లీ ఆగస్టులో కాత ఆగిపోతుంది.అయితే.. ఈ సారి వర్షాలు కాస్త లేటుగా పడడంతో కాయలు ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ చెట్లు వానాకాలం తర్వాత ఎండిపోతాయి.. కొన్ని చెట్ల ఆనవాళ్లు కూడా కనిపించవు. కానీ.. చెట్టు వేరు (గడ్డ) మాత్రం భూమిలో ప్రాణంతోనే ఉంటుంది. మళ్లీ తొలకరినేనే నుంచి పిలకలు పుట్టి తీగలు ఏపుగా పెరుగుతాయి. ఇవి ఏడాదికి ఒక్కసారి మాత్రమే దొరుకుతుండడంతో తినడానికి అందరూ ఇష్టపడతారు.

చికెన్ వెజిటబుల్

బోడకాకరను నేరుగా వండుకున్నా. మాంసంతో కలిపి వండుకుని తిన్నా భలే రుచిగా ఉంటుంది. బోడకాకర కూరను టౌన్ లో ఉండేవాళ్లు చికెన్ వెజిటబుల్ అని కూడా పిలుస్తారు. వీటిని టౌన్ లో ఉండేవాళ్లు చాలామంది మాంసంతో కలిపివండుకుంటారు.

గిరిజనులకు ఉపాధి

అడవిలో కాసే బోడ కాకర గిరిజనులకు ప్రతి ఏటా నెల రోజులపాటు ఉపాధినిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చాలా గ్రామాలకు అనుకుని అడవులు ఉండడంతో బోడకాకర కాయలు ఎక్కువగా దొరుకుతాయి. గిరిజనులు ఉదయాన్నే అడవికి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి బోడకాకర కాయలు కోసుకొస్తారు. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే పండే కూరగాయలు ఇవి. అందుకే వాటిని అమ్మితే వచ్చేది మొత్తం లాభమే. జిల్లాలోని సింగంపల్లి, యత్నారం, రెడ్డిపల్లి, కనుకునూర్, జీలపల్లి, లింగాపూర్, మాదారం, ఊట్లపల్లి, సింగారం, స్తంభంపల్లి (పీపీ), బోర్లగూడెం, గాజరాంపల్లి, రేగులగూడెం, మద్దిమడుగు గ్రామాల్లో ఉండే గిరిజనులు ఎక్కువగా బోడకాకరలు కోసుకొచ్చి ఉపాధి పొందుతున్నారు. 

కిలో ధర 300-400


బోడకాకర కాయల ధర కూడా బాగానే ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో300 రూపాయల నుంచి 400వరకు. ఉంది. పట్టణవాసులు గ్రామాలకు వచ్చి మరీ కొంటున్నారు. అయితే ఇలా గ్రామాలకు వెళ్ళి కొంటే మాత్రం 250 రూపాయలకే కిలో ఇస్తారు. అందుకే వ్యాపారులు గ్రామాలకు వచ్చి గిరిజనుల దగ్గర వీటిని కొని పట్టణాల్లో అమ్ముతుంటారు.