హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ .. ఈ వార్తలు అస్సలు మిస్ కావొద్దు..

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ .. ఈ వార్తలు అస్సలు మిస్ కావొద్దు..

గుడ్ మార్నింగ్ హైదరాబాద్.. మన కోసం.. మన అవసరాల కోసం కొత్తవి వచ్చాయి. సిటీలో రోజూ ఎన్నో మంచి కార్యక్రమాల సిటీ జనం కోసం జరుగుతుంటాయి. అలాంటి సమాచారం మొత్తం.. ఒక్క క్లిక్ లో మీ కోసం.. డోంట్ మిస్ ఇట్.. మీ కోసమే కాదు.. మీ మిత్రుల కోసం.. మీ బంధువుల కోసం.. మీ సన్నిహితులకు ఈ సమాచారం కోసం.. 

హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి వరకు హోటళ్లు, ఫుడ్​కోర్టులు ఓపెన్ :


సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, టిఫిన్ సెంటర్లు ఇక నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఓపెన్ ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు రన్​చేసుకోవచ్చని సిటీ సీపీ సీవీ ఆనంద్ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న విధానాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర షాపులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి  11 గంటల వరకు,  లిక్కర్​షాపులు ఉదయం 10   గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసేందుకు అనుమతులు ఉన్నట్లు సీపీ తెలిపారు. 

28న ఎంజే మార్కెట్ లో గజల్ షాయరీ

సిటీ వారసత్వాన్ని కాపాడడంతోపాటు, కళలను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం ఎంజే మార్కెట్ ప్రాంగణంలో గజల్ షాయరీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గజల్​షాయరీ కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించున్నారు. బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగా ఉన్నవారు బుక్​చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.

పీపుల్స్​ ప్లాజాలో 27 నుంచి సరస్ ​మేళా : సెర్ప్​ ఆధ్వర్యంలో 250 స్టాల్స్​ ఏర్పాటు 

హైదరాబాద్​లోని పీపుల్స్​ ప్లాజాలో సెర్ప్​ ఆధ్వర్యంలో  ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 7 వరకు  సరస్​మేళా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  మహిళా స్వయం సహాయక సంఘాలు తయారీ చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం కోసం నిర్వహిస్తున్న ఈ మేళాలో  తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్పత్తిదారులు  పాల్గొననున్నారు.

Also Read :- నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ

 వారి కోసం దాదాపు 250 స్టాల్స్​ ఏర్పాటు చేశారు. స్టాల్స్​కోసం రిజిస్టేషన్​నిర్వహిస్తున్నారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో  ఎస్​హెచ్​జీ   మహిళలు తయారు చేసిన వస్తువులను అమ్మనున్నారు. ప్రధానంగా చేనేత ఉత్పత్తులు,  హ్యాండ్ క్రాఫ్ట్స్, వెదురు, తుంగతో తయారీ చేసిన వస్తువులు, సిక్కీ క్రాఫ్ట్స్,​ కోయ బొమ్మలు,  టెర్రకోట ( గృహ అలంకరణ), లోహ వస్తువులు, మట్టి గాజులు, చేర్యాల పెయింటింగ్స్, నిర్మల్​ బొమ్మలు ప్రదర్శించనున్నారు.  సిల్క్, కాటన్, కాంతా సారీస్, హ్యాండ్లూమ్ల్​ క్లాత్స్, పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట గొల్లబామ చీరలు, డరీస్​ తెలంగాణకు చెందిన హ్యాండ్లూమ్స్​ ప్రదర్శించనున్నారు. 

అక్రమంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు వేస్తే జరిమానా : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి

వర్షాల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, శానిటేషన్​కార్యక్రమాలు సజావుగా సాగాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె సరూర్ నగర్ నుంచి ఎల్బీనగర్, నాగోలు మీదుగా ఉప్పల్ భగాయత్, ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో పర్యటించారు. అవసరమైన చోట రోడ్లకు రిపేర్లు చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉన్నారు. 

అలాగే అడిషనల్, జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల హెచ్ఓడీలతో కమిషనర్​టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు నీటమునుగుతున్న కాలనీల్లో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్ కనెక్షన్ కమర్షియల్ గా ఉండి, రెసిడెన్షియల్ టాక్స్ చెల్లిస్తున్న కమర్షియల్ ఆస్తులకు నోటీసులు జారీచేసి ట్యాక్స్ రివిజన్ చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్రమంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానా వేయాలని ఆదేశించారు. 

26వ తేదీన హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా :

హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధికల్పన అధికారి వందన తెలిపారు.సెప్టెంబర్ 26న ( గురువారం) మల్లే పల్లిలోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ బిల్డింగులోని జిల్లా ఉపాధి ఆఫీసులో జాబ్ మేళా ఉంటుందన్నారు.

ఎల్ఐసీ కంపెనీ ఆఫ్ ఇండియా 100 వెకెన్సీలకు ఎంపిక చేపడుతోందన్నారు.ఆసక్తి ఉన్నవారు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 10గంటలకు ఆఫీసుకు చేరుకోవాలని సూచించారు. వివరాల కోసం amwww.employment.telangana.gov.in  వెబ్సైట్ ను సందర్శించాలని, లేదా 53284 78933 నంబర్ కు కాల్ చేయాలన్నారు. 

అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం : వచ్చే నెల 21న ప్రదానం

 అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు అవార్డులను అందజేయనున్నది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులు అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ జాతీయ కార్యదర్శి డా.గణగళ్ల విజయ్ కుమార్ తెలిపారు. విద్య, వైద్యం, సమాజ సేవ, విధి నిర్వహణ, సాహిత్యం, నృత్యం, ఆధ్యాత్మికం, చిత్రలేఖనం, జనరల్ నాలెడ్జ్, క్రీడ, శాస్త్రీయ సంగీతం(నాదస్వరం, డోలు, శాక్సో ఫోన్), ఉపాధి కల్పన తదితర రంగాల్లో ప్రతిభ చూపుతున్న వారికి ఆంధ్రరత్న, తెలంగాణ రత్న

బాలరత్న, స్టేట్ బెస్ట్ సిటిజన్ వంటి రాష్ట్ర స్థాయి అవార్డులను అందజేయడంతో పాటు నేషనల్ బెస్ట్ సిటిజన్, విద్యారంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారాలను అందజేయటం జరుగుతుందని విజయ్ కుమార్ వెల్లడించారు. శాస్త్రీయ నృత్యంలో సిద్ధేంద్ర యోగి నాట్య కళా విశారద అవార్డులను ఇస్తామన్నారు. అక్టోబర్ 21న విజయవాడలో అవార్డుల ప్రదానం ఉంటుందని, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. అక్టోబర్ 2లోగా వాట్సాప్ నంబర్​93913 79903కు వివరాలను ఆధారాలతో  పంపించాల్సిందిగా కోరారు.