ప్రపంచంలోని చాలాదేశాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. ఓ చిన్న దోమ! ఇవి ప్రభుత్వాలనే ఇరుకున పడేస్తున్నాయి. డెంగీ, మలేరియా వంటి భయంకరమైన జబ్బులకు కారణమవుతున్న చిన్న దోమను కంట్రోల్ చేయలేకపోతున్నారంటూ కోర్టులు ప్రభుత్వాలకు వార్నింగ్లు ఇస్తున్నాయి. అయితే సింగపూర్ లాంటి దేశాలు మాత్రం ఈ సమస్యకు చాలా ఈజీగా పరిష్కారం చూపుతున్నాయి. ఇంతకీ సింగపూర్ ఏం చేస్తుందో తెలుసా? దోమల్ని పెంచి వీధుల్లో వదులుతోంది!!
అవును.. సింగపూర్ లో దోమల గుడ్లను సేకరించి వాటిని ప్రత్యేక నర్సింగ్ హోంలలో పెంచి, పెద్దచేసి, వీధుల్లో వదిలి పెడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఇదంతా ఎందుకుచేస్తున్నారో తెలుసా? దోమలు సంఖ్యను తగ్గించడానికి!! ఎందీ.. దోమల సంఖ్యను తగ్గించడానికి దోమల పెంచుతున్నారా ఇదేంటి అని డౌట్ పడుతున్నారా? మీరు నమ్మినా, నమ్మకపోయినా దోమల సంఖ్యను తగ్గించేందుకే వాళ్లు ఇదంతా చేస్తున్నారు.
దోమలు కనిపిస్తే వెంటనే చంపేస్తాం -మస్కిటో కాయిల్స్, గుడ్నైట్. ఆలవుట్ వంటి మస్కిటో రిపెల్లెంట్ ను దోమలపై ప్రయోగిస్తాం. దోమలు కుట్టకుండా ఒళ్లంతా రకరకాల క్రీములు రాసుకుంటాం.బెడ్ రూమ్లో మంచాన్ని పూర్తిగా కవర్ చేసేదా దోమల తురను కట్టుకుంటాం. అబ్బో ఇవేనా, ఇంకా ఎన్నో అవస్థలు పడతాం. ఇవన్నీ చిన్న దోమ నుంచి తప్పించుకునేందుకే. అయితే సింగపూర్ ప్రజలు మాత్రం ఓ ఫ్యాక్టరీ నుంచి దోమలను కొనుక్కొచ్చి సెల్లార్లో, దాబాలపై, పార్కులో బాల్కనీలో వదిలిపెడుతున్నారు. అలా ఎందుకు అని అడిగితే.. సేమ్ అన్సర్ దోమల సంఖ్యను తగ్గించేందుకేననీ!
ముల్లును.. ముల్లుతోనే తీయాలి. ఇది మనదగ్గరి మాట: దోమను దోమతోనే అంతమొందించాలి. ఇది సింగపూర్ మాట. దోమలను దోమలతో ఎలా అంతమొందిస్తారు? అని అడిగితే.. మేం జెనటికల్లీ మోడిఫైడ్ చేసిన దోమలను సృష్టించి, వాటి సాయంతో మిగతా దోమలను అంతమొందిస్తామని చెబుతున్నారు. కొంతమంది సింగపూర్ కి చెందిన నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజన్సీ సైంటిస్టులు. ప్రాజెక్ట్ వోద్యారియా" పేరుతో దోమలను పూర్తిగా నిర్మూలించే ప్రయోగాన్ని చేపట్టారు. అది సక్సెస్ కావడమే కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు వీళ్ల ప్రయోగం గురించే మాట్లాడుకుంటోంది.
ALSO READ : ఉగాండాను వణికిస్తున్న డింగాడింగా వైరస్..లక్షణాలివే..
ఇంతకీ ఈ సైంటిస్టుల బృందం ఏం చేసిందంటే, వీధులు, మురికివాడల్లో నుంచి దోముల గుడ్లను సేకరించి, ప్రత్యేక మస్కిటో నర్సింగ్ హోంలలో పెంచుతారు. జెనెటికల్ గా మోడిపై చేసి, సృష్టించిన ఈ దోమలను సైంటిస్టులంతా 'గుడ్ మస్కిటోస్" అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి అసలు కుట్టవట. అంతేకాదు మిగతా దోమలను చాలా త్వరగా తమ ప్రేమలో పడేసుకుంటాయట నర్సింగ్ హోంలో పెరిగిన దోమలను కాకుండా బయట తిరిగే దోమలను సైంటిస్టులు 'బ్యాడ్ మస్కిటోస్' అని పిలుస్తారు.
ఈ బ్యాడ్ మస్కిటోస్ ఉండే ప్రాంతాల్లో గుడ్ మస్కిటోను వదిలిపెడతారు. అలా గుడ్ మస్కిటోస్ తో బ్యాడే మస్కిటోస్ కలిసిపోయేలా చేస్తారు. ఇలా ఎందుకంటే గుడ్ మస్కిటోస్ తో కలిసిన బ్యాడ్ మస్కిటోస్, తమ పునరుత్పత్తి శక్తిని పూర్తిగా కోల్పోతాయట. ఇలా దోమల్లో పునరుత్పత్తి శక్తి లేకుండా చేయడం ద్వారా వాటి సంఖ్యను తగ్గిస్తారన్నమాట.
ఆస్ట్రేలియా, బ్రెజిల్, కొలంబియా దేశాల్లో..
హోర్బానియా అనేది ఓ బ్యాక్టీరియా, దీనికి డెంగీ లాంటి జబ్బులకు కారణమయ్యే వైరస్ లను నాశనం చేసే శక్తి ఉంది. అందుకే ఆస్ట్రేలియా బ్రెజిల్, కొలంబియా దేశాల్లో కూడా వోర్యాబియా బ్యాక్టీరియాను ప్రవేశపెట్టిన దోమల్ని పెంచుతున్నారు. పునరుత్పత్తి ప్రక్రియలో మిగతా దోమలకూ ఆ బ్యాక్టీరియాను అంటిస్తుంది. దీంతో కొత్తగా పుట్టే దోమలో కూడా వోల్యాబియా బ్యాక్టీరియా ఉంటుంది. ఇలా కొత్తగా పుట్టే అన్ని దోమల్లో వోల్యాబియా అనే బ్యాక్టీరియా ఉండడం వల్ల అవి డెంగీలాంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్ లను వ్యాపింపజేయలేవు. ఆడదోమల గుడ్లలో వోల్యాబియా బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా కొత్తదోమలను సృష్టిస్తారు. వీటిని పెట్టెల్లో పెట్టి స్కూలు స్టూడెంట్లకు ఇస్తారు. పిల్లలు తమ ఇళ్లకు తీసుకెళ్లి పరిసరాల్లో విడిచిపెడతారు. ఈ దోమలును విడిచి పెట్టిన ప్రతిచోటా మంచి ఫలితాలు కలిపించాయని ఆస్ట్రేలియా సైంటిస్ట్ స్కాట్ ఓ నీల్ తెలిపారు.
ALSO READ : చలి జ్వరాలు వస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఈ పరీక్షలు చేయించుకోండి.. బీ అలర్ట్..!
వోల్యాబియా బ్యాక్టీరియాను ఆస్ట్రేలియాలో తొలిసారిగా కనుగొన్నది కూడా ఆయనే. అయితే జబ్బుల్ని వ్యాపింపజేయకపోయినా ఈ దోమలు కుట్టడం మాత్రం కామనే కానీ సింగపూర్ లో మోడిపై చేసిన దోమలకు కనీసం కుట్టే శక్తి కూడా లేదు
ఇన్నోవేషన్
దోమలను నిర్మూలించడానికి ఇదే నేచురల్ పద్ధతి. ఎటువంటి హానికారక రసాయనాలు వాడకుండానే దోమల్లో పునరుత్పత్తి తగ్గించడం ద్వారా వాటి సంఖ్యను తగ్గిస్తాం. ఈ పద్ధతి వల్ల మనుషుల ఆరోగ్యానికి వాతావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు. మలేరియా, డెంగీ వంటి ఋబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉండదు. ఇప్పటికే చాలామంది. మా దగ్గర నుంచి గుడ్ మస్కిటోస్
తీసుకెళ్తున్నారు. వీటిని వదిలిపెట్టిన ప్రాంతాల్లో దోమల సంఖ్య 90 శాతం తగ్గింది. ఆయా ప్రాంతాల్లో డెంగీ కేసులు కూడా 90% తగ్గినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
లీ చువాన్ సింగ్
(నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ చైర్మన్, సింగపూర్)