వందే భారత్ స్పీడ్ పెరగనుంది.. జస్ట్ 4 గంటల్లోనే బెంగళూరు To చెన్నై

వందే భారత్ స్పీడ్ పెరగనుంది.. జస్ట్ 4 గంటల్లోనే బెంగళూరు To చెన్నై

దేశీయ రైల్వే రంగంలో వందే భారత్ రైళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇన్నాళ్లు సాధారణ రైళ్ల మాదిరే నామపాత్రపు వేగంతో పట్టాలపై పరుగులు పెట్టిన ఈ రైళ్లు.. త్వరలో స్పీడ్ అందుకోనున్నాయి. బెంగళూరు, చెన్నై నగరాల మధ్య ప్రయాణించే వందే భారత్‌ రైలు జస్ట్ నాలుగు గంటల్లోనే తన ప్రయాణాన్ని ముగించనుంది. అందుకు అవసరమైన ట్రాక్ అప్‌గ్రేడేషన్ పనులు చకచకా జరుగుతున్నాయి.

నిజానికి ప్రారంభంలో వందే భారత్ రైళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టికెట్ ధరలు ఎక్కువుగా ఉండటం.. ప్రయాణ సమయాల్లో పెద్దగా మార్పు లేకపోవడంతో ప్రయాణికులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్త పరిచారు. అందుకు పరిష్కారం చూపే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల మధ్యప్రయాణ సమయాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తోంది. 

ప్రధాన మార్గాల్లోని ట్రాక్‌లను రైళ్లు వేగంగా వెళ్లేందుకు అనువుగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ప్రస్తుతం నైరుతి రైల్వే (SWR) యొక్క బెంగళూరు-జోలార్‌పేట సెక్షన్‌లో స్పీడ్ ట్రయల్‌ నిర్వహిస్తోంది. దీని పరిమితిని గంటకు 110 కి.మీ నుండి 130 కి.మీకి పెంచేందుకు. ఒకసారి ట్రయల్ సక్సెస్ అయ్యిందంటే చెన్నై- బెంగళూరు మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ఈ రూట్‌లో నడిచే వందేభారత్ రైళ్లతో పాటు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రధానంగా ప్రయోజనం చేకూరుతుంది.

ALSO READ : Formers Protest: శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత..ఢిల్లీ వైపు వెళ్తున్న రైతులను అడ్డుకున్న పోలీసులు

ప్రస్తుతం ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్‌లో చెన్నై, బెంగళూరు మధ్య ప్రయాణానికి 4.20 గంటల సమయం పడుతుంది. అప్‌గ్రేడేషన్ పూర్తయ్యాక ఆ సమయం మరో 20 నిమిషాలు తగ్గనుంది. అంటే కేవలం 4 గంటల్లోనే చెన్నై, బెంగళూరు మధ్య ప్రయాణించవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు. మరోవైపు, ఈ రూట్‌లో నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ట్రావెల్ టైమ్ 5.10 గంటలు ఉండగా.. ఆ సమయం 10 నిముషాలు తగ్గనుంది.