
Gold Price Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ విషయంలో కొన్ని సడలింపులను ప్రకటించిన నాటి నుంచి మెల్లగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో వరుసగా రెండు రోజుల నుంచి గోల్డ్ రేట్లలో భారీగా క్షీణత కొనసాగటం భారతీయ కొనుగోలుదారుల్లో సంతోషాన్ని నింపుతోంది. అయితే షాపింగ్ చేయటానికి ముందు హైదరాబాదుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రేట్లను ఇక్కడ పరిశీలించండి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3వేల 500 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 720, ముంబైలో రూ.8వేల 720, దిల్లీలో రూ.8వేల 735, కలకత్తాలో రూ.8వేల 720, బెంగళూరులో రూ.8వేల 720, పూణేలో రూ.8వేల 720, కేరళలో రూ.8వేల 720, వడోదరలో రూ.8వేల 725, జైపూరులో రూ.8వేల 735, మధురైలో రూ.8వేల 720, మంగళూరులో రూ.8వేల 720, నాశిక్ లో రూ.8వేల 723, అయోధ్యలో రూ.8వేల 735, బళ్లారిలో రూ.8వేల 720, గురుగ్రాములో రూ.8వేల 735, నోయిడాలో రూ.8వేల 735 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ALSO READ | బంగారం ధరలు.. ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయంటే.. మెయిన్గా ఈ నాలుగే కారణాలు !
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాముకు ఏకంగా రూ.3వేల 300 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 518, ముంబైలో రూ.9వేల 518, దిల్లీలో రూ.9వేల 533, కలకత్తాలో రూ.9వేల 518, బెంగళూరులో రూ.9వేల 518, పూణేలో రూ.9వేల 518, కేరళలో రూ.9వేల 518, వడోదరలో రూ.9వేల 523, జైపూరులో రూ.9వేల 533, మధురైలో రూ.9వేల 518, మంగళూరులో రూ.9వేల 518, నాశిక్ లో రూ.9వేల 521, అయోధ్యలో రూ.9వేల 533, బళ్లారిలో రూ.9వేల 518, గురుగ్రాములో రూ.9వేల 533, నోయిడాలో రూ.9వేల 533గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర తులం(10 గ్రాములకు) రూ.87వేల 200 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత తులం(10 గ్రాములకు) రూ.95వేల180గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 స్వల్ప తగ్గుదలతో రూ.లక్ష 9వేల 800 వద్ద కొనసాగుతోంది.