తెలంగాణలోని ఈ ప్రాంతాల నుంచి శబరిమలైకి 28 స్పెషల్​ట్రైన్స్

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే  అయ్యప్ప భక్తుల కోసం శబరిమలైకి 28 స్పెషల్​ ట్రైన్స్​నడపనున్నట్లు వెల్లడించింది. మౌలాలి నుంచి -కొల్లం రూట్‎లో ఈనెల 11 నుంచి జనవరి  30 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి తదితర స్టేషన్లలో ట్రైన్స్ ఆగుతాయి. 

కాచిగూడ నుంచి -కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి- కొల్లం-, నర్సాపూర్ నుంచి ​-కొల్లం మధ్య జనవరి 2 నుంచి జనవరి 29 వరకు స్పెషల్ ​ట్రైన్స్ ​అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాచిగూడ నుంచి -కొట్టాయం మధ్య   మహబూబ్​నగర్,వనపర్తి, గద్వాల్ స్టేషన్లలో ట్రైన్స్ ఆగుతాయి. 

కాకినాడ టౌన్ నుంచి- కొల్లం రూటులో సామర్లకోట, రాజమండ్రి,  తణుకు, భీమవరం తదితర స్టేషన్లలో స్పెషల్​ట్రైన్స్ ఆగుతాయి. నర్సాపూర్ నుంచి- కొల్లం రూట్​లో  పాలకొల్లు, భీమవరం,  ఆకివీడు తదితర స్టేషన్లలో ట్రైన్స్ ఆగుతాయి.  శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి టికెట్ బుకింగ్  ప్రారంభమవుతుందని, శబరిమలైకి వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.