ఒకవైపు తీవ్ర స్థాయిలో ఎండలు, మరోవైపు నీటి కొరత కర్ణాటక రాష్ట్రాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈక్రమంలో బెంగుళూరుకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బెంగళూర్, దక్షిణ కర్ణాటక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కురుస్తాయని IMD అధికారులు తెలిపారు. ఉగాది పండగ నుంచి వరుసగా మూడు రోజుల పాటు బలమైన గాలులు, ఉరుములతో వర్షాలు పడనున్నాయి.
నగరం మొత్తం ఒకే విధంగా వర్షం కురవకపోవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో కాస్త నీటి కష్టాలు తీరనున్నాయి. ఏప్రిల్ 1న బెంగుళూర్ లో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఏప్రిల్ నెలలో సగటు కంటే 3 డిగ్రీలు ఎక్కువ.