క్రికెట్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్..ఉప్పల్ మ్యాచ్కి సిటీ నుంచి ప్రత్యేక బస్సులు

క్రికెట్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్..ఉప్పల్ మ్యాచ్కి సిటీ నుంచి ప్రత్యేక బస్సులు

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్ - ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠభరితమైన టెస్ట్ మ్యాచ్ ని చూసేందుకు క్రికెట్ అభిమానుల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు TSRTC ఎండి సజ్జనార్ తెలిపారు. 

ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం(జనవరి 25) నుంచి ఐదు రోజుల పాటు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా TSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను అదనంగా నడుపుతోంది.

 ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై తిరిగి స్టేడియం నుంచి 7 గంటనుంచి ఈ బస్సు లు బయల్దేరుతాయి. ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని  క్రికెట్ అభిమానులు వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసి కోరుతోంది. 

 

గురువారం(జనవరి 25) నుంచి ఉప్పల్‌ వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ పోరుకు రాజీవ్‌గాంధీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చూడగానే ఇది మన ఉప్పల్ స్టేడియమేనా అని ఆశ్చర్యపోయేలా కలర్‌ఫుల్‌గా మార్చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు.

గురువారం ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపిన రాచకొండ సీపీ.. స్టేడియం చుట్టూ ఏర్పాటుచేసిన 360 సీసీ కెమెరాలతో భద్రతను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని తెలిపారు. ప్రేక్షకులు స్టేడియం లోపల బయట మంచిగా నడుచుకోవాలని కోరారు.