మేడారం వెళ్లలేని భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొక్కులతో పాటుగా ఆమ్మవార్లకు నిలువెత్తు బంగారం ఆన్ లైన్ ద్వారా చెల్లించే సేవలను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసులు, టీయాప్ ఫోలియో ద్వారా భక్తులు ఆన్ లైన్ సేవలను బుక్ చేసుకోవాలని సూచించారు. బంగారం (బెల్లం)కిలో రూ. 60 చొప్పున చెల్లించి మొక్కు సమర్పణ సేవ బుక్ చేసుకోవాలని తెలిపారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతరగా ప్రసిద్దికెక్కిన మేడారం జాతర ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది.ఈ జాతరకు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలిరానున్నారు. భక్తులును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆరు వేల స్పెషల్ బస్సులపను ఏర్పాటు చేసింది. అందులోనూ మహాలక్ష్మి స్కీమ్ ను అమలు చేసింది ప్రభుత్వం.