![రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల](https://static.v6velugu.com/uploads/2025/02/good-news-for-farmersjpg1_cBWbphE0d6.jpg)
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా స్కీమ్ నిధులను విడుదల చేసింది. విడతల వారీగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తోన్న ప్రభుత్వం.. తాజాగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు 2025, ఫిబ్రవరి 10న 2 వేల 223 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. తొలి విడతలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రెండు దశల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 34 లక్షల 75వేల 994 మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. రైతు భరోసా నిధులు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరాకు రూ.15 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.. రూ.15 వేలు కాకుండా రూ.12 వేల ఆర్థిక సహయం చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌కు సంబంధించిన నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.