Gold Rate: దిగొస్తున్న పసిడి ధరలు.. వరుసగా నాలుగో రోజూ ఢమాల్, హైదరాబాద్ రేట్లిలా..

Gold Rate: దిగొస్తున్న పసిడి ధరలు.. వరుసగా నాలుగో రోజూ ఢమాల్, హైదరాబాద్ రేట్లిలా..

Gold Price Today: అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన సుంకాల తర్వాత అనూహ్యంగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. రిటైల్ మార్కెట్లలో అధిక ధరల కారణంగా ప్రజలు కొనుగోలుకు దూరంగా ఉంటున్న వేళ బులియన్ వ్యాపారుల నుంచి కూడా భారీగా డిమాండ్ పడిపోయింది. దీంతో క్రమంగా తగ్గుతున్న ధరలు సామాన్యులకు ఊరటను కలిగి స్తున్నాయి. అలాగే ట్రంప్ ద్రవ్యోల్బణ భయాలపై నిన్న చేసిన కీలక కామెంట్స్ స్టాక్ మార్కెట్లలో కూడా భయాలకు బ్రేకులు వేశాయి. ఈ క్రమంలో తగ్గిన ధరలకు అనుగుణంగా షాపింగ్ చేయాలనుకునేవారు నేటి రిటైల్ ధరలను తప్పక తెలుసుకోవాలి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6వేలు భారీ తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.8వేల 225, ముంబైలో రూ.8వేల 225, దిల్లీలో రూ.8వేల 240, కలకత్తాలో రూ.8వేల 225, బెంగళూరులో రూ.8వేల 225, కేరళలో రూ.8వేల 225, వడోదరలో రూ.8వేల 230, జైపూరులో రూ.8వేల 240, లక్నోలో రూ.8వేల 240, మంగళూరులో రూ.8వేల 225, నాశిక్  లో రూ.8వేల 228, అయోధ్యలో రూ.8వేల 240, బళ్లారిలో రూ.8వేల 225, నోయిడాలో రూ.8వేల 240, గురుగ్రాములో రూ.8వేల 240గా విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6వేల 500 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి నుంచి తగ్గిన రిటైలో గోల్డ్ విక్రయ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.8వేల 973, ముంబైలో రూ.8వేల 973, దిల్లీలో రూ.8వేల 988, కలకత్తాలో రూ.8వేల 973, బెంగళూరులో రూ.8వేల 973, కేరళలో రూ.8వేల 973, వడోదరలో రూ.8వేల 230, జైపూరులో రూ.8వేల 988, లక్నోలో రూ.8వేల 988, మంగళూరులో రూ.8వేల 973, నాశిక్  లో రూ.8వేల 976, అయోధ్యలో రూ.8వేల 988, బళ్లారిలో రూ.8వేల 973, నోయిడాలో రూ.8వేల 988, గురుగ్రాములో రూ.8వేల 988 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల225 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.8వేల 973గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 3వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.