వాతావరణ శాఖ గుడ్న్యూస్:అతివృష్టి లేదు..అనావృష్టి లేదు..వర్షాలు చక్కగా కురుస్తాయి..!

వాతావరణ శాఖ గుడ్న్యూస్:అతివృష్టి లేదు..అనావృష్టి లేదు..వర్షాలు చక్కగా కురుస్తాయి..!

దేశ ప్రజలకు వాతావరణ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అనావృష్టి ఉండదు..అతివృష్టి ఉండదు..సాధారణ రుతుపవనాలతో మంచి వర్షాలుంటాయిని అంచనావేసింది. ఎల్నినో గానీ, లానినో గానీ ఏర్పడకపోవడం..అంటే ఫసిఫిక్ మహాసముద్రపు నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు తటస్థంగా ఉండటమే ఇందుకు కారణం. ఇది వచ్చే శీతాకాలం సీజన్ వరకు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాదాపు12యేళ్ల తర్వాత ఇలా పసిఫిక్ మహాసముద్రపు నీటి ఉపతరితలం ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులు లేకుండా నిశ్చలంగా ఉండటం ఇదే మొదటిసారి. 

పసిఫిక్ మహాసముద్రంలో లానినా ముగిసింది. లానినా ముగింపును అమెరికా వాతావరణ శాఖ ధృవీకరించింది. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం అయిన పసిఫిక్ మహాసముద్రం శీతాకాలం వరకు తటస్థంగా ఉంటుందని అంచనావేసింది. ఈ మార్పు భారత దేశ రుతుపవనాలకు సానుకూలంగా ఉంటాయిని తెలిపింది. అంటే కరువు ఉండదు, వరదలు (అధిక వర్షపాతం ఉండే) వచ్చే అవకాశాలు తక్కువ అని తెలిపింది. 

పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ దశ అంటే  సముంద్రం ఉపరితలం అధిక వేడి ఉండదు చల్లగా ఉండదు. ఉపరితలం వేడిగా ఉంటే ఈ స్థితిని ఎల్ నినో అంటారు. ఈ పరిస్థితుల్లో రుతుపవనాలు బలహీనపడతాయి. అతి చల్లగా ఉంటే ఆస్థితిని లానినో అంటారు. దీని వల్ల అధిక వర్షపాతానికి అవకాశం ఉంటుంది. సముద్రం ఎప్పుడైతే తటస్థంగా ఉంటుందో అపుడు భారత దేశంలో సమతుల్య రుతుపవనాలు ఏర్పడతాయి. అంటే అటు కరువు ఉండదు..వరదలూ ఉండవు. సాధారణ రుతుపవనాలతో సరిపోను వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితిపై భారత వాతావరణ శాఖ (IMD)లో మాజీ మాన్సూన్ పోడ్ కాస్టర్ రాజీవన్ కూడా అంచనాలను సమర్థించారు. తటస్థ పరిస్థితులలో కరువు లేదా వరదలు వంటి తీవ్రమైన పరిస్థితులు తక్కువగా ఉంటాయి.. అయితే తటస్థ పరిస్థితులలో రుతుపవనాలను అంచనా వేయడం ఇప్పటికీ కష్టమైన పనే అన్నారు. 

►ALSO READ | ఐక్యరాజ్య సమితిలో కుడా లేఆఫ్స్ అంట.. పరిస్థితి ఇంత దారుణంగా ఉందా..

ప్రైవేట్ ఏజెన్సీ స్కైమెట్ విడుదల చేసిన మాన్సూన్ అంచనాల ప్రకారం భారత్ లో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 103% పొందే అవకాశం ఉంది.  ఇది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ. దాదాపు12యేళ్ల తర్వాత ఇలా పసిఫిక్ మహాసముద్రపు నీటి ఉపతరితలం ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులు లేకుండా నిశ్చంగా ఉండటం ఇదే మొదటిసారి.