నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని RITES ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్,డిప్లామా అప్రెంటీస్, ఇతర ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 1 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది : 20-12-2023.
వయోపరిమితి: అభ్యర్థులు 18 ఏండ్లు నిండి ఉండాలి. నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు ఉంది.
అర్హత: అభ్యర్థులు ఐటీఐ, డిప్లామా ఉండాలి. డిగ్రీ, NCVT,SCVT ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(ఇంజనీరింగ్)-117, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(నాన్-ఇంజనీరింగ్)-43, డిప్లామా అప్రెంటిస్-28, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్-69
ఏ విధంగా అప్లయ్ చేయాలి
ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లమా అభ్యర్థులు తప్పనిసరిగా నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) పోర్టల్ https://nats.education.gov.in/student_type.php లో రిజిస్టర్ అయి ఉండాలి. ఐటీఐ పాస్ లేదా గ్రాడ్యుయేట్ BA/BBA/B.Com ఉత్తీర్ణులైన అభ్యర్థులు తప్పనిసరిగా అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) పోర్టల్ www.apprenticeshipindia.gov.in.లో నమోదు చేసుకోవాలి.
NATS/NAPS అప్రెంటిస్ షిప్ పోర్టల్ లో ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థులు సంబంధిత NATS/NAPS పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలి. వారికి కేటాయించిన యూజర్ ఐడీ/ ఈమెయిల్ ఐడిని ఉపయోగించి అప్రెంటిస్ షిప్ ఓపెనింగ్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.