
టూవీలర్ మేకర్ కేటీఎం మనదేశ మార్కెట్లో 390 ఎండ్యురో ఆర్ బైక్‌ను విడుదల చేసింది. ఇందులోని 399 సీసీ సింగిల్ -సిలిండర్ ఇంజిన్ 46 పీఎస్ పవర్‌ను, 39 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. దీనికి ఆరు గేర్లు ఉంటాయి. ఎల్ఈడీ హెడ్‌లైట్, రైడ్ -బై -వైర్ థ్రాటల్, రైడింగ్ మోడ్స్ (స్ట్రీట్, ఆఫ్-రోడ్), ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్ ప్లస్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఎండ్యురో ఆర్ ధరలు రూ.3.36 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి మొదలవుతాయి. ఇది అన్ని కేటీఎం షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది.