మూసీ బాధితులూ.. డోంట్ వర్రీ.. దాన కిషోర్ గుడ్ న్యూస్

మూసీ బాధితులూ.. డోంట్ వర్రీ.. దాన కిషోర్ గుడ్ న్యూస్

హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇండ్లు ఇస్తున్నామని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని దానకిషోర్ వెల్లడించారు. మూసీకి వచ్చే మురికిని క్లీన్ చేసేందుకు రూ.3,800 కోట్లు కేటాయించామని, మూసీ నిర్వాసితులకు ఉపాధితో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి అధికారులు వెళుతున్నారని, ప్రతీ విషయం వివరిస్తున్నారని తెలిపారు. చట్టానికి లోబడే హైడ్రా అధికారులు పనిచేస్తున్నారని, మూసీ నిర్వాసితులను బలవంతంగా తరలించడం లేదని ఆయన చెప్పారు. ఆక్రమణలకు గురైన మూసీని విస్తరింపజేయాలని తెలిపారు. 

ALSO READ | ఏ వ్యక్తికీ అన్యాయం జరగనివ్వం.. మూసీ నిర్వాసితులకు దానకిషోర్ భరోసా

మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్, వెస్ట్ కారిడార్ నిర్మిస్తామని.. 55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్, వెస్ట్ కారిడార్లు నిర్మిస్తామని దానకిషోర్ పేర్కొన్నారు. ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుందని, మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామని ఆయన తెలిపారు. మొన్నటి వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ ప్రక్షాళన అనేది సుందరీకరణ కోసం చేస్తున్న పనులు కాదనే విషయం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్జీవోలతో కలిసి నదీగర్భంలో ఉంటున్నవారిని ఆదుకుంటామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి  దానకిషోర్ భరోసా ఇచ్చారు.