పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. మద్ధతు ధర ప్రకటించిన ప్రభుత్వం.. టన్నుకు ఎంతంటే..

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. మద్ధతు ధర ప్రకటించిన ప్రభుత్వం.. టన్నుకు ఎంతంటే..

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. మద్ధతు ధర ప్రకటిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్వర్వులు జారీ చేశారు. పామాయిల్ రైతులను ప్రోత్సహిస్తామని, అన్ని విధాల ప్రభుత్వం సహాయం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.

పామాయిల్ పంటకు మద్ధతు ధర ఖరారు చేసినట్లు తెలిపిన మంత్రి.. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. పామాయిల్ టన్నుకు 20 వేల 871 రూపాయల మద్ధతు ధర ప్రకటిస్తూ ఉత్తర్వులు  జారీ చేశారు. 

రాష్ట్రంలో పామాయిల్ పంటను అధికంగా పండించాలని, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేలా పామాయిల్ ఉత్పత్తి జరగాలని మంత్రి పిలుపునిచ్చారు. అందుకోసం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు.