పండగ సీజన్ వచ్చేసింది..రాబోయే నెల రోజుల్లో దసరా, దీపావళి, ఛత్ పండుగలు వస్తున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు దుర్గాష్టమి, దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. దీంతో రైల్వే ప్రయాణికులు రద్దీ పెరిగేఅవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక రైళ్లే నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ( సెప్టెంబర్28)నాడు ఓ ప్రకటనలో తెలిపారు.
రైళ్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ.108 రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు అదనంగా కోచ్ లను పెంచుతున్నారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దాదాపు 12వేల 500 కోచ్ లను పండగ సీజన్ లో నడిపేందుకు రైల్వే శాఖ సిద్దమవుతోంది.
Also Read : తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం
ఈ ఏడాది పండగ సీజన్ లో దేశ వ్యాప్తంగా దాదాపు 5వేల 975 స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతేడాది ఈ సీజన్ లో 4వేల 429 ప్రత్యేక ట్రైన్లను నడిపారు. అక్టోబర్ 12న దసరా, అక్టోబర్31నదీపావళి, నవంబర్ 7న ఛత్ పూజ పండుగలు ఉన్నందున రద్దీ ఎక్కువగా ఉండే బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్ లో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ప్రత్యేక ట్రైన్స్ నడపనున్నారు.