హైదరాబాద్ ప్రజలకు గుడ్న్యూస్..రాపిడోలో మెట్రో టికెట్లు

హైదరాబాద్ ప్రజలకు గుడ్న్యూస్..రాపిడోలో మెట్రో టికెట్లు

హైదరాబాద్ ప్రయాణికులు రాపిడో యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా మెట్రో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి  రాపిడో, ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ మెట్రో  రైల్ (హైదరాబాద్‌‌‌‌‌‌‌‌) ఒప్పందం కుదుర్చుకున్నాయి. రోజుకి సగటున 4.80 లక్షల మంది  హైదరాబాద్ మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారని అంచనా.

హైదరాబాద్  ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు రైడ్ హెయిలింగ్ ఫ్లాట్ ఫాం రాపిడో తమ యాప్ ద్వారా మెట్రో టికెట్ బుకింగ్ ను ప్రవేశ పెట్టడానికి ఎల్ ఎండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం 15 శాతం టికెట్లను రాపిడో ద్వారా కొనుగోలో చేయాలని భావిస్తున్నారు. 

మెట్రో సెక్టార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్ (PPP), హైదరాబాద్ మెట్రో రైలులో రోజూ సగటున 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. Rapido కూడా రోజూ రెండు కోట్ల రైడ్‌లను కలిగి ఉంది.