ప్రముఖ పిజ్జా కంపెనీ డామినోస్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారతదేశానికి స్వతంత్ర్యం సిద్ధించి 77 వసంతాలు పూర్తయి 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఫ్లాట్ 77 మెనూను డామినోస్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. 77 రూపాయలకే మార్గెరిటా పిజ్జాలు, గార్లిక్ బ్రెడ్స్టిక్స్ ఆర్డర్ చేసుకుని తినేసి ఎంజాయ్ చేసే అవకాశం పిజ్జా లవర్స్కు వచ్చింది. ఇది లిమిటెడ్ టైం ఆఫర్. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఇంత తక్కువ ధరకు డామినోస్ పిజ్జా తినే ఛాన్స్ వచ్చింది. ఈ విషయం తెలిసి.. పిజ్జా లవర్స్ పండగ చేసుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెజార్టీ ఉద్యోగులకు ఇవాళ సెలవు దినం. వ్యాపార సంస్థలు కూడా దాదాపుగా ఉండవు. సో.. ఇంటిల్లిపాది నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు.
పగలు మాత్రమే కాదు రాత్రుళ్లు కూడా పిజ్జాలు, బర్గర్లను హైదరాబాద్ నగరవాసులు ఇష్టంగా తింటున్నారు. రాత్రి 11 గంటల తర్వాత ప్రజలు బర్గర్లు, పిజ్జా, బిర్యానీలను విపరీతంగా ఆర్డర్ చేస్తున్నారని, రాత్రి 11 గంటల తర్వాత వస్తున్న ఫుడ్ ఆర్డర్‌లలో దాదాపు 23% పెరుగుదల నమోదైందని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తెలిపింది. ఇప్పుడు ఉదయం 11 గంటల తర్వాత వచ్చే ఈ ఆర్డర్‌లు స్విగ్గీ మొత్తం ఆర్డర్‌లలో 8.5% అయ్యాయి. ఉదయం 11 గంటల తర్వాత వచ్చే ఆర్డర్లలో చాలా వరకు విద్యార్థులు, యువత ఎక్కువగా నివసించే ఇతర నగరాల నుంచి వస్తున్నాయి. చాలా మంది యువత నగరాలకు చదువుకోవడానికి లేదా పని చేయడానికి వస్తారు. అందుకే పెద్ద సంఖ్యలో యువత ఈ నగరాల్లో నివసిస్తున్నారు.