ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు గుడ్ న్యూస్

ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు గుడ్ న్యూస్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు,  సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్​(ఇంటీరిమ్​ రిలీఫ్​) ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూల వేతనంపై 5% ఐఆర్​ మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పీఆర్‌సీ కమిటీ తన ప్రతిపాదనలు పంపినప్పటికీ, అవి అమల్లోకి వచ్చేలోగా జరిగే ఆలస్యానికి ప్రతిఫలంగా ఉద్యోగి నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే భృతినే మధ్యంతర భృతి అంటారు. ద్రవ్యోల్పణం, ధరలు ఇలా పలు అంశాల ఆధారంగా ఈ మధ్యంతర భృతి ఎంత శాతం ఇస్తే ఉద్యోగికి మేలు అనే విషయాన్ని నిర్ణయిస్తారు. పీఆర్‌సీ అమల్లోకి వచ్చిన వెంటనే ఈ మధ్యంతర భృతి రద్దవుతుంది.

ALSO READ | నిన్న దిలావర్ పూర్.. నేడు లగచర్ల.. కాంగ్రెస్ సర్కారు తీరుపై ప్రశంసలు