సాఫ్ట్‌వేర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలలో జాబ్స్ జాతర

సాఫ్ట్ వేర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఫ్రెషర్స్ కు ఐటీ కంపెనీలైన విప్రో ( Wipro), టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్(Infosys)  గుడ్ న్యూస్ చెప్పాయి. ఫైనాన్షియల్ ఇయర్–2026 లో భారీ సంఖ్యలో ఫ్రెషర్స్ ను తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాయి.  అంటే 2025–26 ఆర్థిక సంవత్సరంలో వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. 

Wipro 12 వేల జాబ్స్ ఆఫర్:

 ఐటీ మేజర్ విప్రో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 10 వేల నుంచి 12 వేల జాబ్స్ ను ఆఫర్ చేస్తోంది. అంటే 2025–26 ఆర్థిక సంవత్సరంలో విప్రో దాదాపు 12 వేల క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఫ్రెషర్స్ ను తీసుకునే ప్లాన్ లో ఉంది. కంపెనీ క్వాటర్–3 రిజల్ట్స్ ప్రకటించిన సందర్భంగా చీఫ్ హెచ్ఆర్(HR) సౌరభ్ గోవిల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 

ఐటీలో ఈ మధ్య ఎక్కువ శాతం లేఆఫ్స్ తో చాలా మంది ఎంప్లాయ్స్ జాబ్స్ కోల్పోతున్నారు. కొందరు కంపెనీలు మారుతున్నారు. అదేవిధంగా కొత్తగా రిక్రూట్ మెంట్స్ లేకపోవడంతో ఈసారి ఐటీలో మందగమనం తప్పదని భావిస్తున్నారు. ఈ సమయంలో విప్రో భారీ మొత్తంలో ఫ్రెషర్స్ ను తీసుకోనుందని అనటంతో.. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో నియామకాల జోరు అందుకుంటుందని అనుకుంటున్నారు. 20

2022 గ్రాడ్యుయేట్స్ ను రిజెక్ట్ చేస్తారా?

22 గ్రాడ్యుయేట్స్ ను రిజెక్ట్ చేస్తారా? గ్రాడ్యుయేట్స్ ను కొత్త జాబ్స్ కు రిజెక్ట్ చేస్తారా అనే ప్రశ్నకు.. జాబ్ ఆఫర్ చేసిప్పటి నుంచి ఆన్ బోర్డ్ అయ్యే వరకు టైమ్ గ్యాప్ ఉంటుందని కంపెనీ హచ్ఆర్ అన్నారు. అందుకోసం రీఅస్సెస్‌మెంట్ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. అందుకోసం క్యాండిడేట్స్ కంపెనీలో కొనసాగడానికి స్కిల్ ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 

ALSO READ | మీకు కోడింగ్ లో దమ్ముంటే.. కోటీశ్వరులను చేస్తా : ఎలన్ మస్క్ ఓపెన్ ఆఫర్

ఈసారి కొత్త ఎంప్లాయిస్ ను రిక్రూట్ చేసుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సహకారం తీసుకోన్నట్లు తెలిపారు. 

20 వేల ఫ్రెషర్స్ తీసుకునే ప్లాన్ లో ఇన్ఫోసిస్ .. అదే బాటలో టీసీఎస్:

ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీలు కూడా భారీ ఎత్తున రిక్రూట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాయి.  2025–26 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇన్ఫోసిస్ దాదాపు 20 వేల కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అదే విధంగా టీసీఎస్ కూడా ఈ ఏడాది కొత్త గ్రాడ్యుయేట్స్ ను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 

ఐటీలో గత కొంత కాలంగా రిక్రూట్ మెంట్స్ లేక అభ్యర్థులు నిరుత్సాహంతో ఉన్నారు. తాజాగా టాప్ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఎన్ఫోసిస్, విప్రో కొత్త రిక్రూట్ మెంట్ ప్లాన్స్ ప్రకటించడం అభ్యర్థులకు శుభసూచకం. అయితే ఎక్కువ శాతం క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఫ్రెషర్స్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2 లేదా 3 ఏళ్ల సీనియర్స్ ను కూడా పరిగణిస్తే బాగుంటుందని కొందరు అనుకుంటున్నారు. చూడాలి మరి.. కంపెనీల రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో.