
ఖమ్మం: తేజా రకం మిర్చి ఖమ్మం మార్కెట్కు రోజు వారీగా 19వేల నుంచి 20వేల క్వింటాళ్ల మిర్చి ప్రస్తుతం మార్కెటుకు వస్తోంది. గత నెల వరకు 11వేల నుంచి రూ.12వేల వరకు పలికిన ధరలు ఇప్పుడు క్రమంగా పెరిగాయి. దీంతో తేజా మిర్చి గరిష్ట ధర రూ.13,300 నుంచి రూ.13500 ధర పలుకుతోంది. మోడల్ ధరలు రూ.11,500 నుంచి రూ.12,000 వరకు ధరలు ఉన్నాయి. వరంగల్మార్కెట్కు రోజు వారీగా తేజా రకం మిర్చి 6వేల క్వింటాళ్లకు పైగా మార్కెట్కు వస్తుండగా.. ధరలు రూ.13వేల నుంచి 12వేల మధ్య కొనసాగుతున్నాయి.
అదే విధంగా వండర్హాట్రకం 2800 క్వింటాళ్లకు పైగా వస్తుండగా.. రూ.14వేల నుంచి రూ.15, 500 వరకు ధరలు పలుకుతున్నాయి. యుఎస్ 341 రకం 6 వేల క్వింటాళ్లు మార్కెట్కు వస్తుండగా.. రూ.12వేల వరకు ధరలు పలుకుతున్నాయి. హైదరాబాద్లోని మలక్పేట్మహబూబ్మాన్షన్మార్కెట్కు తక్కువ మొత్తంలోనే వెయ్యి క్వింటాళ్లలోపూ మిర్చి వస్తోంది.
ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న మిర్చి ధరలు క్రమంగా పెరుగుతుండటంతో రైతులకు కాస్త ఊరట లభించినట్టయింది. ఇంటర్నేషనల్మార్కెట్లో కదలికల వల్ల మిర్చి యార్డులో ధరలు కొంత మేర పుంజుకుంటున్నాయి. మిర్చి రకాన్ని బట్టి క్వింటాల్కు సగటున రూ.300 నుంచి రూ.500 వరకు ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా మిర్చి ధరలు స్థిరంగా ఉన్న నేపథ్యంలో తాజా పెరుగుదల రైతులకు ఊరటనిస్తోంది.
ఇటీవల ఎగుమతులు ఆశాజనకంగా ఉండడం, దేశీయంగానూ కొనుగోళ్లు పెరగడం, నాణ్యమైన మిర్చికి డిమాండ్ ఏర్పడడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. యార్డుకు వచ్చే మిర్చి పరిమాణం ఇదే తరహాలో ఉంటే ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి.