Flix Bus India: హైదరాబాద్-విజయవాడ బస్ టికెట్ 99 రూపాయలే..!

Flix Bus India: హైదరాబాద్-విజయవాడ బస్ టికెట్ 99 రూపాయలే..!

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్​ బస్సు సేవలు అందించే ట్రావెల్ టెక్ కంపెనీ ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బస్ ఇండియా హైదరాబాద్-విజయవాడ మార్గంలో నాలుగు ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈటిఓ మోటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యంతో ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్ ఇండియా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా,  బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే కార్యకలాపాలకు ముందు రెండు వారాల టెస్ట్ రన్ జరుగుతుంది. తదనంతరం బ్యాటరీ పనితీరు,  ప్రయాణికుల బుకింగ్ వంటి కొలమానాల ఆధారంగా సేవలు అందిస్తారు.

బస్సుల బ్యాటరీల చార్జింగ్​కోసం 240 కిలోవాట్ల ఫాస్ట్ చార్జర్లను వాడతారు.  ఈ సందర్భంగా ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బస్ ఇండియా ఎండి  సూర్య ఖురానా మాట్లాడుతూ ప్రారంభ ఆఫర్గా హైదరాబాద్-విజయవాడ మార్గంలో టికెట్ను రూ.99కే అందిస్తున్నామని చెప్పారు.  దేశవ్యాప్తంగా 200లకుపైగా నగరాల్లో సేవలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.